ఈడీపై కవిత పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు

ఈడీపై కవిత పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. విచారణ కోసం మహిళను ఈడీ ఆఫీస్‌కు పిలిపించవచ్చా లేదా అన్న అంశాన్ని పరిశీలిస్తామని చెప్పింది. కవిత పిటిషన్‌పై ఆరు వారాల్లో కౌంటర్‌ వేయాలని ఈడీని ఆదేశించింది. ఆ తర్వాత రెండు వారాల్లో రీ జాయిండర్‌ దాఖలు చేయాలంటూ కవితకు ఆదేశాలు జారీ చేసింది. తనను ఈడీ ఆఫీస్‌కు పిలిపించి విచారించడాన్ని సవాల్‌ చేస్తూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.

Next Story