నేడు సుప్రీంకోర్టులో సీబీఐ వర్సెస్ శ్రీలక్ష్మి కేసు విచారణ

నేడు సుప్రీంకోర్టులో సీబీఐ వర్సెస్ శ్రీలక్ష్మి కేసు విచారణ

ఇవాళ సుప్రీం కోర్టులో సీబీఐ వర్సెస్ శ్రీలక్ష్మి కేసు విచారణకు రానుంది. గనుల కేటాయింపుల్లో ఓబులాపురం మైనింగ్ కంపెనీకి లబ్ది కలిగించారని శ్రీలక్ష్మీపై సీబీఐ ఆరోపించింది. అయితే గతంలో శ్రీ లక్ష్మికి క్లీన్ చిట్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది సీబీఐ.ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు శ్రీలక్ష్మి. జగన్‌ అక్రమాస్తుల కేసుల్లోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆమె. 2011లో శ్రీలక్ష్మిని అరెస్ట్ చేసింది సీబీఐ.పెన్నా సిమెంట్స్ కేసులో జగన్,ధర్మాన ప్రసాదరావు,పెన్నా ప్రతాప్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలతో పాటు అభియోగాలు ఎదుర్కొంటున్నారు శ్రీ లక్ష్మి.

Next Story