Suryapet: అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఉద్రిక్తత

Suryapet: అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఉద్రిక్తత

సూర్యాపేట జిల్లాలో జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఐ లోకేష్ దాడి చేసాడని స్థానిక కాంగ్రెస్ ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి ఆరోపించడం సంచలనంగా మారింది. మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెంలో ఈ ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి జైబీమ్ అంటే ఏమిటని అక్కడికి వచ్చిన కళాకారులను అడిగే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న ఎస్‌ఐ లోకేష్‌.. కాంగ్రెస్ ఎంపీటీసీని పక్కకు తీసుకెళ్లారు. కాసేపటికే శ్రీనివాసరెడ్డి కుడి కన్నుపై తీవ్ర గాయంతో సభ ముందుకు వచ్చారు. తనపై ఎస్ఐ దాడి చేసారని ఆరోపించారు. దాంతో శ్రీనివాసరెడ్డి వర్గం ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్, సీఐ వీరరాఘవులను అడ్డుకున్నారు. దాంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు ఎంపీటీసీకి న్యాయం చేస్తామని సీఐ హామీ ఇవ్వడంతో శ్రీనివాసరెడ్డి అనుచరులు ఆందోళన విరమించారు. ఎస్ఐ మాత్రం తాను ఎవ్వరిపైనా చేయి చేసుకోలేదని వివరణ ఇచ్చారు.Next Story