నిండుకుండలా మారిన తాలిపేరు ప్రాజెక్టు

నిండుకుండలా మారిన తాలిపేరు ప్రాజెక్టు

ఎగువన ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాద్రి జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మండలంలోని ఆదివాసీ ఆటవీ ప్రాంత గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాజెక్టు సామర్ధ్యం మించి ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. జలాశయం 23 గేట్లు ఎత్తి లక్షా నాలుగు వేల ఇరవై మూడు వేల క్యూసెక్యుల నీరు దిగువనున్న గోదావరిలోనికి విడుదల చేస్తున్నారు. విధుల్లో ఉన్న ప్రాజెక్టు సిబ్బంది అలెర్టుగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Next Story