అంగళ్లులో నాపై హత్యాయత్నం చేశారు: చంద్రబాబు

అంగళ్లులో నాపై హత్యాయత్నం చేశారు: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.అంగళ్లులో తన పైనే హత్యాయత్నం చేశారని,సైకో ముఖ్యమంత్రి ఆదేశాలతోనే హత్యాయత్నం జరిగిందన్నారు.అంగళ్లు ఘటనపై సీబీఐ విచారణకు చంద్రబాబు డిమాండ్‌ చేశారు. అంగళ్లుకు చేరుకునేలోపే 5 వేల కోట్ల స్కామ్‌ను బయటపెట్టానన్న చంద్రబాబు..అంగళ్లులో తనని చంపాలనే వైసీపీ వాళ్లు వచ్చారని అన్నారు. నాపైనే హత్యాయత్నం చేసి.. నా పైనే కేసు పెడతారా? అంటూ ప్రశ్నించారు.సైకో చెప్పాడు కాబట్టి మంత్రి పెద్దిరెడ్డి,అతడి తమ్ముడు దాడికి ప్రయత్నించారని అన్నారు.తనపై చాలాసార్లు హత్యాయత్నం చేయాలని ప్లాన్‌ చేశారని ఎక్కడికి వెళ్లిన దాడి చేస్తున్నారని అన్నారు.

Next Story