రేపు పోలవరం -పట్టిసీమప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్న చంద్రబాబు

రేపు పోలవరం -పట్టిసీమప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్న చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు రేపు పోలవరం -పట్టిసీమప్రాజెక్టు సందర్శించనున్నారు. ఇవాళ రాత్రికి ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ఏలూరు చేరుకోనున్న చంద్రబాబు.... రేపు పోలవరాన్ని పరిశీలిస్తారు. పోలవరం ఈఎన్సీ అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా పోలవరం వెళ్తామంటున్నారు టీడీపీ నేతలు. సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు..... సోమవారాన్ని పోలవారంగా మార్చారు. ఏకంగా 28 సార్లు పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించారు. రేపు సోమవారం కావడంతో..... విపక్షనేతగా పోలవరం వెళ్లాలని భావిస్తున్నారు చంద్రబాబు.

Next Story