అర్ధరాత్రి రోడ్డు విస్తరణపై ధూళిపాళ్ల ఆగ్రహం

అర్ధరాత్రి రోడ్డు విస్తరణపై ధూళిపాళ్ల ఆగ్రహం

గుంటూరు జిల్లా పొన్నూరులో అర్ధరాత్రి రోడ్డు విస్తరణ పనులు చేపట్టడంపై మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు వెడల్పు కారణంగా నష్టపోయే భవన యజమానులకు పరిహారం చెల్లించకుండా పనులు ఎలా చేపడుతారని ప్రశ్నించారు. పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్‌ అధికారులు పనులు చేయించాల్సిన అవసరం ఏం వచ్చిందని నిలదీశారు. దుకాణాల యజమానులను బెదిరించి పనులు చేస్తే టీడీపీ చూస్తూ ఊరుకోబోదన్నారు. పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Next Story