వైసీపీ సర్కారుపై సోమిరెడ్డి ఆగ్రహం

వైసీపీ సర్కారుపై సోమిరెడ్డి ఆగ్రహం

సోమశిల జలాశయంలో 20 టీఎంసీల నీటిని వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. చెరువుల్లో మట్టి తవ్వేసి కోట్లు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. రైతులను నష్టపరిచి వైసీపీ నేతలు మట్టి అమ్ముకుని కోట్లు సంపాదిస్తున్నారని అన్నారు. సిలికాలో భారీ భూకుంభకోణం జరిగిందని ఆ డబ్బంతా లోటస్‌పాండ్‌కు వెళుతుందని ఆరోపించారు. అసైన్డ్‌ భూముల్ని కాజేసే కుట్ర జరుగుతోందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అక్రమ సంపాదనలో మునిగి తేలుతున్నారని విమర్శించారు. జిల్లాకు చెందిన మంత్రి అక్రమ సంపాదనతో విదేశాల నుంచి తెచ్చిన సామాగ్రితో ఇల్లు నిర్మించుకున్నారని అన్నారు.

Next Story