ఏపీ గుండా రాజ్యంగా మారిందన్నారు టీడీపీ నేతలు. పుంగనూరు, తంబళ్లపల్లె దాడులపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.దాడులకు సంబంధించిన వీడియో, ఫోటోలను గవర్నర్‌కు అందజేశారు. గవర్నర్‌ను కలిసిన టీడీపీ బృందంలో నిమ్మల రామానాయుడు, బోండా ఉమ,గద్దె రామ్మోహన్, వర్ల రామయ్య, అశోక్‌బాబు ఉన్నారు.
ప్రతిపక్ష నేతను అంతం చేయాలనే దుర్మార్గ ఆలోచనతో జగన్ రాజకీయం చేస్తున్నారని,గతంలో చంద్రబాబు ఇంటి, బస్సుపై దాడి చేశారని మండిపడ్డారు.టీడీపీ కార్యాలయంపై దాడులు జరిగితే జగన్ సహా పోలీసులు సమర్థించుకున్నారని అన్నారు.చంద్రబాబు 2500 కిలోమీటర్లు పర్యటిస్తుంటే దారిలో వైసీపీ నేతలను పోలీసులు ఎలా అనుమతించారని ప్రశ్నించారు.చంద్రబాబును అడ్డుకుంటామన్న వారు యధేచ్చగా తిరుగుతున్నాఎందుకు అరెస్ట్ చేయలేదని అన్నారు.డీజీపీ కనీసం తమని కలవడానికి ఇష్టపడడం లేదని గవర్నర్‌కు చెప్పామని తెలిపారు.పెద్దిరెడ్డిని మంత్రి వర్గం నుంచి డిస్మిస్ చేయాలని..ఎస్పీ రిషాంత్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని గవర్నర్‌ను కోరామని తెలిపారు టీడీపీ నేతలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com