Anantapuram: గుత్తిలో తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని టీడీపీ ఆందోళన

Anantapuram: గుత్తిలో తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని టీడీపీ ఆందోళన

అనంతపురం జిల్లా గుత్తిలో తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గాంధీచౌక్‌ నుంచి మున్సిపల్‌ ఆఫీస్‌ వరకు ఖాళీ బిందెలతో భారీ ర్యాలీ తీశారు. సీఎం డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. మన్సిపల్‌ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చారు. నీటి సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని టీడీపీ నేతలు హెచ్చరించారు. నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరారు.

Next Story