
తెలంగాణలో బీసీ బిడ్డలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయకపోతే భూకంపం సృష్టిస్తానని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ( Teenmaar Mallanna ) అన్నారు. రిజర్వేషన్‌ను అమలుచేయకపోతే ప్రజల్లో ఒక్కరు కూడా తిరగలేరని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీ సర్కారు రాబోతుందని, బీసీలను గెలిపించేందుకు అవసరమైతే కేసీఆర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకైనా తాను వస్తానన్నారు. ఇలా మాట్లాడినందుకు మహా అయితే పదవి పోతుందని, మళ్లీ టీవీ ముందు కూర్చుంటానని చెప్పారు. బీసీల సహకారంతోనే తాను గెలిచానని, తాను ఓడిపోతానని ఎద్దేవా చేసిన వారిని ఎన్నికల్లో గెలవనివ్వనని అన్నారు. తెలంగాణలో బీసీ సర్కారు రాబోతోందన్నారు. బిచ్చగాళ్లలా కుల సంఘాలకు రూ.50 కోట్లను ఏ లెక్కన కేటాయిస్తారని ప్రశ్నించారు. బడ్జెట్‌లో బీసీలకు రూ.9 వేల కోట్లు కేటాయిస్తే తాను నిర్భయంగా ప్రశ్నించానన్నారు. వరంగల్‌లో వార్ రూం ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు. బీసీలను గెలిపించేందుకు అవసరమైతే కేసీఆర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకైనా తాను వస్తానన్నారు. ఇలా మాట్లాడినందుకు మహా అయితే పదవి పోతుందని, మళ్లీ టీవీ ముందు కూర్చుంటానని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com