
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 23న చేవెళ్లలో జరిగే బీజేపీ పార్లమెంట్ ప్రభాస్ యోజన సభకు ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరుకానున్నారు. అనంతరం చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఇక తెలంగాణకు పలువురు బీజేపీ జాతీయ నేతలు ఇప్పటికే క్యూ కడుతున్నారు. ఇవాళ బీజేపీ జాతీయ ఆర్గనైజింగ్ జాయింట్ జనరల్ సెక్రటరీ శివ ప్రకాశ్, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ సునీల్ బన్సల్ రానున్నారు. తెలంగాణలో బీజేపీ బలోపేతం, వచ్చే ఎన్నికల్లో గెలుపు వ్యూహాలపై బండి సంజయ్ సహా రాష్ట్ర ముఖ్య నాయకులతో బన్సల్ చర్చించనున్నారు. పార్లమెంట్ ప్రభాస్ యోజన, పోలింగ్ బూత్ స్వశక్తికరణపై సమీక్షించనున్నారు. కేంద్రమంత్రుల పర్యటనలు, ప్రభాస్ యోజన సభా ఏర్పాట్లపై బన్సల్ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com