ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల ఆందోళన

ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల ఆందోళన

ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు కేసీఆర్‌ సర్కారుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. తెలంగాణ భవన్‌ వద్ద బైఠాయించి ధర్నా చేశారు. ఈ ధర్నాలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని వెంటనే ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. రైతుల్ని గాలికి వదిలేసి సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన వెళ్లారంటూ విమర్శిస్తున్నారు. చనిపోయిన వరద బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలంటూ ఆందోళన చేశారు.

Next Story