
By - Vijayanand |22 Aug 2023 5:51 PM IST
కాంగ్రెస్ ఆశావహులు గాంధీభవన్‌కు క్యూ కడుతున్నారు. టికెట్ల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకుంటున్నారు. ఐదు రోజుల్లో 280 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. నిన్న ఒక్క రోజే 220 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 25 వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉండటంతో.. మరో 200 దరఖాస్తులు వస్తాయని పీసీసీ అంచనా వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల నుంచి తరలివస్తున్న నేతలతో గాంధీభవన్‌లో సందడి వాతావరణం నెలకొంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com