Telangana: బోనమెత్తిన గవర్నర్ తమిళిసై

Telangana: బోనమెత్తిన గవర్నర్ తమిళిసై

హైదరాబాద్ రాజ్ భవన్‌ ప్రాంగణంలోని అమ్మవారి ఆలయంలో గవర్నర్ తమిళిసై బోనాలు సమర్పించారు. రాష్ట్ర ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారన్న గవర్నర్ బోనాల పండుగ వెనుక ఎంతో చరిత్ర ఉందన్నారు. ఆషాడ, శ్రావణ మాసాల్లో బోనాల పండుగను తెలంగాణ ప్రజలు ఎంతో భక్తితో నిర్వహిస్తారని తెలిపారు. అమ్మవారి దయవల్ల సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానని తెలిపారు.

Next Story