బీజేపీ, కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ మంత్రి కేటీఆర్‌

బీజేపీ, కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ మంత్రి కేటీఆర్‌

బీజేపీ, కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్‌. ధరలు పెంచిన బీజేపీ నేతల్ని నిలదీయాలన్నారు. 50 ఏళ్లు అధికారం ఇస్తే.. కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. సమైక్య పాలనలో తెలంగాణ ఆగమైందన్నారు. కేసీఆర్‌ సారధ్యంలో నేడు తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుందని చెప్పారు. బీజేపీ ఎంపీ అర్వింద్‌ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని.. 70 ఏళ్ల వయస్సున్న కేసీఆర్‌ను నోటికొచ్చినట్లు తిడతారా అని భగ్గుమన్నారు. రేవంత్ తెలంగాణ వాది కాదని.. తెలంగాణకు పట్టిన వ్యాధి అని కేటీఆర్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ కుంభకోణాలేనని అన్నారు.

Next Story