Indian Army: ఆర్మీ ట్రక్కు ప్రమాదంలో తెలంగాణ జవాన్ మృతి

Indian Army: ఆర్మీ ట్రక్కు ప్రమాదంలో తెలంగాణ జవాన్ మృతి

జమ్మూకశ్మీర్‌లోని లద్దాక్‌లో జరిగిన ఆర్మీ ట్రక్కు ప్రమాదంలో తెలంగాణకు చెందిన జవాన్ మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం తంగళ్లపల్లి పంచాయతీ పరిధిలోని తిర్మన్‌దేవునిపల్లికి చెందిన నీరటి చంద్రశేఖర్‌ ప్రాణాలు కోల్పోయారు. జవాన్ స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. నీరటి చంద్రశేఖర్‌ 2010లో ఆర్మీ జవానుగా సైన్యంలో చేరారు. చంద్రశేఖర్‌కు భార్య, నాలుగేళ్ల కొడుకు, రెండేళ్ల కూతురు ఉన్నారు.15 ఏళ్లకు గాను 13 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు. మరో రెండేళ్ల తర్వాత సర్వీస్ పూర్తవుతుంది. అంతలోనే చంద్రశేఖర్ ప్రాణాలు కోల్పోయారు.

Next Story