తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి టీడీపీ తెలంగాణ అధ్యక్షురాలి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆమెను రాజ్యసభకు పంపిస్తారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ నుంచి జూనియర్ ఎన్టీఆర్‌ను దూరం పెట్టేందుకే సుహాసినికి కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. నందమూరి సుహాసిని ఏపీ రాజకీయాల్లోకి వస్తారంటూ కూడా గతంలో సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడివాడ, గన్నవరం, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట లేదంటే మరో నియోజకవర్గం నుంచి సుహాసిని పోటీ చేస్తారంటూ ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇవేమీ నిజం కాలేదు. అయితే తాజాగా సుహాసినికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది .
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com