వరదల్లో చిక్కుకున్న తెలుగు విద్యార్ధులు

వరదల్లో చిక్కుకున్న తెలుగు విద్యార్ధులు

హిమాచల్ ప్రదేశ్‌లోని కసోల్‌లో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విద్యార్థులు చిక్కుకుపోయారు. ఇందులో నలుగురు తెలుగు విద్యార్థులున్నారు. వీరిలో ముగ్గురు అబ్బాయిలు కాగా ఓ అమ్మాయి ఉంది. అయితే ఎవరి ఫోన్లూ పనిచేయకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు గురించి తెలియకపోవడంతో మంత్రి కేటీఆర్‌ను ఫోన్‌ ద్వారా సంప్రందించారు. విషయం తెలుసుకున్న మంత్రి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. కులూ జిల్లా యంత్రాంగంతో మాట్లాడి సహాయం అందించాల్సిందిగా కోరారు.

Next Story