తెలంగాణలో వైన్‌ షాపులకు పోటెత్తుతున్న టెండర్లు

తెలంగాణలో వైన్‌ షాపులకు పోటెత్తుతున్న టెండర్లు

తెలంగాణలో వైన్‌ షాపులకు టెండర్లు పోటెత్తుతున్నాయి.. నిజామాబాద్‌ జిల్లాలోనూ వ్యాపారులు పోటీ పడుతున్నారు. శ్రావణమాసం సెంటిమెంట్‌తో టెండర్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మహిళలకు ఎలాంటి రిజర్వేషన్లు లేకపోయినా.. కలిసొస్తుందన్న ఆశతో వారిపై టెండర్లు వేస్తున్నారు. ప్రస్తుతం రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం అంతంతమాత్రంగానే ఉండటంతో వైన్‌ షాప్‌ల టెండర్లకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. గత ఏడాది నిజమాబాద్‌ జిల్లాలో 102మద్యం దుకాణాలకు 17 వందల దరఖాస్తులు వచ్చాయి. ఈఏడాది ఈ సంఖ్య 2వేలు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Next Story