విశాఖ పెందుర్తిలోని ఆలయంలో భారీ చోరీ

విశాఖ పెందుర్తిలోని ఆలయంలో భారీ చోరీ

విశాఖ జిల్లా పెందుర్తి ప్రధాన రహదారి పక్కన ఉన్న ఆలయంలో భారీ చోరీ జరిగింది. నూకాలమ్మ ఆలయంలో పట్టపగలు దొంగతనం జరగడం చర్చనీయాంశంగా మారింది. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఉన్న వెండి కిరీటం, 40 తులాల బంగారంతోపాటు పంచపాత్ర ఇతర వస్తువులు చోరీ అయ్యాయి. ఆభరణాల్ని సంచిలో వేసుకొని దొంగ తీసుకెళ్తున్న విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. చోరికి సంబంధించి పెందుర్తి పీఎస్‌లో ఆలయ అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ పుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

Next Story