Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా వాసులు ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీసీ ఎలక్ట్రికల్ ఏసీ బస్సు.. ఇన్నోవా కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కర్నూలుకు చెందిన పలువురు ఇన్నోవా కారులో తిరుపతికి వెళుతుండగా.. రైల్వే కోడూరు మండలం రాజానగర్ సమీపంలో ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సును ఢీకొట్టడం జరిగింది.

ఈ ఘటనలో కర్నూలు జిల్లా ఎల్లురు నగర్‌కు చెందిన రావూరి ప్రేమ్ కుమార్ (51), రావూరి వాసవి (47), నరసింహారెడ్డి నగర్‌కు చెందిన కామిశెట్టి సుజాత (40) మృతి చెందారు. వీరంతా తిరుపతిలో రిసెప్షన్ వేడుకకు వెళుతుండగా, ప్రమాదం జరిగింది. ఘటనలో గాయపడిన మరో ఇద్దరిని 108 అంబులెన్స్‌లో రైల్వే కోడూరు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story