
By - Vijayanand |15 Aug 2023 12:35 PM IST
టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి అల్లూరి విగ్రహం వరకు పాదయాత్ర చేస్తారు. విజన్ - 2047 డాక్యుమెంట్‌ను ఉడా పార్క్‌లోని ఎంజీఎం మైదానంలో ఆవిష్కరించనున్నారు. ఇండియా, ఇండియన్, తెలుగు- విజన్ 2047 అని ఈ డాక్యుమెంట్‌కు నామకరణం చేశారు. భారతదేశం గ్లోబల్ లీడర్‌గా ఎదిగేందుకు అనుసరించాల్సిన ఐదు వ్యూహాలతో గ్లోబల్ ఫోరం సస్టెయినబుల్ ట్రాన్స్ ఫర్మేషన్ సంస్థ.. ఈ డాక్యుమెంట్‌ను రూపొందించింది. దీనిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు చంద్రబాబు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com