REVANTH: ఇందిరమ్మ రాజ్యామా.. దొరల రాజ్యమా

REVANTH: ఇందిరమ్మ రాజ్యామా.. దొరల రాజ్యమా

ఇందిరమ్మ రాజ్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఇందిరమ్మ పాలన సాగిందని వివరించారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కావాలో దొరల రాజ్యం కావాలో ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇందిరమ్మ రాజ్యాన్ని తప్పుపట్టిన కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సాపూర్, పరకాల సభల్లో రేవంత్ పాల్గొన్నారు. కేసీఆర్ ను ఇంటికి పంపే సమయం వచ్చిందన్న ఆయన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను వంద కిలోమీటర్ల లోపల పాతిపెట్టాలని పిలునిచ్చారు. పదేళ్లలో ఏమి చేశారో చెప్పకుండా బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్ ను తిడుతున్నారని ఆక్షేపించారు. కేసీఆర్ నమూనా అంటే కుంగే బ్యారేజీలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అధికారంలోకి వస్తే అమలు చేసే ఆరు గ్యారంటీలు సహా సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేస్తామని వివరించారు.

మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ....ఇంటింటి ప్రచారాలు, రోడ్‌షోలు నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్‌ అభ్యర్థులు ప్రధానంగా ఆరుగ్యారంటీలను విస్తృతంగా ప్రచారం చేస్తుండగా....భాజపా అభ్యర్థులు కేంద్రప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు.

Next Story