హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు దారి మళ్లింపు

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు దారి మళ్లింపు

హైదరాబాద్ - విజయవాడ రూట్‌లో రాకపోకలు నిలిచిపోవడంతో.. అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా ఐతవరం వద్ద జాతీయ రహదారిపై మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో.. ఆ మార్గాన్ని పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కెట్‌పల్లి, కోదాడ వద్ద మళ్లిస్తున్నారు. నార్కెట్‌పల్లి నుంచి అద్దంకి హైవే మీదుగా గుంటూరుకు పంపుతున్నారు. అలాగే కోదాడ నుంచి హుజూర్‌నగర్, మిర్యాలగూడ మీదుగా అద్దంకి హైవే మీదకు పంపుతున్నారు.

Next Story