ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిచొద్దు: ఎస్‌ఐ అజయ్‌కుమార్

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడిపితే రోడ్డు ప్రమాదాలను నివారించొచ్చని నడిగూడెం ఎస్‌ఐ అజయ్‌కుమార్ అన్నారు. యువత దేశ భవిష్యత్తు అని... రోడ్డు ప్రమాదాల బారినపడి ఉజ్వల భవిష్యత్తును కోల్పోకోడదని హితవు పలికారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని... ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించవద్దని... ఆటోడ్రైవర్లకు సూచించారు. కూలీ పనులకు వెళ్తున్న సమయంలో ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని అజయ్‌కుమార్ వెల్లడించారు. సాధారణంగా బైక్ నడిపే వారే హెల్మెట్ ధరిస్తున్నారని, ఇది సరి కాదన్నారు. బైక్‌లపై వెళ్లేవారు ఇద్దరూ కచ్చితంగా హెల్మెల్ ధరించాలన్నారు.
ట్రిపుల్ రైడింగ్ చేయొద్దని ఎస్‌ఐ అజయ్‌కుమార్ హెచ్చరించారు. వాహనదారులు లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. మైనర్లు వాహనాలు నడపొద్దన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో రోడ్డు భద్రతా నియమాలపై డ్రైవర్లకు అవగాహన కల్పించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే సీజ్ చేస్తామన్నారు. బండి వెంట పత్రాలు, లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆటోల్లో డెక్‌లు వినియోగించరాద్దని స్పష్టం చేశారు. డ్రైవర్ పక్కన ఇద్దరు, ముగ్గుర్ని కూర్చోనిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com