Police Suspended: హవాలా డబ్బు మాయం.. 11 మంది పోలీసులు సస్పెండ్

Police Suspended: హవాలా డబ్బు మాయం.. 11 మంది పోలీసులు సస్పెండ్

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ డీజీపీ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్నారు. వాహ‌న డ్రైవ‌ర్ల నుంచి లంచాలు తీసుకుంటూ దొరికిన 11 మంది పోలీసుల్ని స‌స్పెండ్ చేశారు. ఈ నేప‌థ్యంలో డీజీపీ రాజీవ్ కృష్ణ ఆదేశాలు జారీ చేశారు. వేర్వేరు జిల్లాలో వాహ‌న డ్రైవ‌ర్ల నుంచి లంచం తీసుకుంటున్న వీడియోలు ఆన్‌లైన్‌లో వైర‌ల్ కావ‌డంతో వాటి ఆధారంగా డీజీపీ చ‌ర్య‌లు తీసుకున్నారు. ప్రాథ‌మిక ద‌ర్యాప్తు ఆధారంగా 11 మందిని స‌స్పెండ్ చేశారు. చిత్ర‌కూట్‌, బందా, కౌషాంబి జిల్లాల్లో ప‌లు పోలీసుల్ని స‌స్పెండ్ చేశారు. పోలీసు శాఖ స్టేట్మెంట్ ప్ర‌కారం స‌స్పెండ్ అయిన వారిలో ఓ ఇన్‌స్పెక్ట‌ర్‌, ఓ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌, న‌లుగురు స‌బ్ స‌బ్ఇన్‌స్పెక్ట‌ర్లు, అయిదుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు.

Next Story