మెదక్‌ జిల్లా వన దుర్గ ప్రాజెక్టకు పోటెత్తిన వరద

మెదక్‌ జిల్లా వన దుర్గ ప్రాజెక్టకు పోటెత్తిన వరద

గత రెండు రోజుల నుండి ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా, మెదక్‌ జిల్లా వన దుర్గ ప్రాజెక్టకు వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో ఏడుపాయల శ్రీవన దుర్గాదేవి అమ్మవారి దర్శనాన్ని నిలిపివేసారు అధికారులు. నీటి ప్రవాహం తీవ్ర స్ధాయిలో ఉన్నందున్న భక్తులకు అమ్మవారి గర్భాలయ దర్శనం నిలిపివేసి నట్లు, తెలిపారు ఆలయ ఈవో సారా శ్రీనివాస్‌. భక్తులను అమ్మవారిని రాజగోపురంలో దర్శనం చేసుకోవాలన్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున అధికారులు సూచించిన చోటే స్నానమాచరించాలని భక్తులను కోరారు.

Next Story