
By - Bhoopathi |13 July 2023 10:15 AM IST
దేశంలో కొత్తగా మరో నాలుగు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెలాఖరులోనే వీటిని ప్రారంభించేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 25 రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. నెలాఖరులో ప్రారంభం కానున్న 4 రైళ్లూ ఎనిమిదేసి కోచ్‌లతో నడవనున్నాయి. ఇందులో ఏడు ఛైర్ కార్లు, ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లు ఉండనున్నాయి. ఈ నెలలో ప్రారంభించనున్న రూట్లలో ఢిల్లీ- చండీగఢ్, చెన్నై- తిరునల్వేలి, లఖ్‌నవూ- ప్రయాగ్‌రాజ్, గ్వాలియర్- భోపాల్ ఉండనున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com