ఆందోళన చేపట్టిన వెలిగొండ ప్రాజెక్ట్‌ నిర్వాసితులు

ఆందోళన చేపట్టిన వెలిగొండ ప్రాజెక్ట్‌ నిర్వాసితులు

ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట వెలిగొండ ప్రాజెక్ట్‌ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఏళ్ల తరబడిగా సమస్యలను పరిష్కరించకపోవడంతో దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు నిర్వాసితులు వాపోయారు. మూడు జిల్లాల రైతాంగం కోసం భూములు త్యాగం చేస్తే... ప్రభుత్వం తమపై చిన్న చూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 11 గ్రామాల ప్రజల త్యాగాల ఫలితమే వెలిగొండ ప్రాజెక్ట్‌ అని రైతు సంఘం నేతలు అన్నారు. 18 ఏళ్లు దాటిన యువతీ యువకులకు ఆర్‌ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపజేసి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story