పవన్‌కల్యాణ్‌కు విశాఖ పోలీసుల నోటీసులు

పవన్‌కల్యాణ్‌కు విశాఖ పోలీసుల నోటీసులు

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు విశాఖ పోలీసులు నోటీసులు జారీ చేశారు. విశాఖ వారాహి యాత్రలో భాగంగా.. జగదాంబ జంక్షన్‌ మీటింగ్‌లో పవన్‌ చేసిన వ్యాఖ్యలపై నోటీసులు ఇచ్చారు. సీఎం జగన్‌ను అవమానించేలా పవన్‌ వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు. పవన్‌ ప్రసంగం ప్రజల్ని రెచ్చగొట్టేలా ఉందని.. నిరాధారమైన ఆరోపణలు చేశారని.. విశాఖ ఈస్ట్‌ డివిజన్‌ పోలీసులు నోటీస్‌లో ప్రస్తావించారు. ఇకపై అదే విధంగా మాట్లాడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని విశాఖ ఈస్ట్‌ డివిజన్‌ ఏసీపీ పేర్కొన్నారు.

Next Story