
విశాఖలో క్యాబ్ డ్రైవర్లు సమ్మె బాట పట్టారు. ఏడాదిన్నర క్రితం క్లీన్ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా క్యాబ్ వెహికల్స్‌ని వైసీపీ సర్కార్ అట్టహాసంగా ప్రారంభించింది. అయితే అప్పటి నుంచే క్యాబ్ డ్రైవర్లకు కష్టాలు మొదలయ్యాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, పని గంటలు పెంపు, కాంట్రాక్టర్ వేధింపులతో డ్రైవర్లు రోడ్డెక్కారు. విశాఖలో ఉన్న ఎనిమిది జోన్లలో సుమారు వెయ్యి వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సమ్మెలో సుమారు 11వందల మంది డ్రైవర్లు పాల్గొన్నారు. అన్ని జోన్ ఆఫీస్‌ల ఎదుట ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ప్రైవేట్ డ్రైవర్‌లతో వాహనాలు తీయించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాన్ని డ్రైవర్లు అడ్డుకున్నారు. లేబర్ కోర్ట్ ఆదేశాల ప్రకారం జీతాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com