
1901 తర్వాత భారతదేశంలో ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. సగటు ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు శుక్రవారం వెల్లడించింది. మొదటిసారిగా, దేశవ్యాప్తంగా సగటు కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైంది. 124 ఏళ్ల తర్వాత అత్యంత వెచ్చని ఫిబ్రవరి నమోదైంది.
ఇది గోధుమ, శనిగ వంటి పంటలకు ముప్పు కలిగించవచ్చని హెచ్చరించింది. మార్చి నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త డీఎస్ పాయ్ వెల్లడించారు. 2023 తర్వాత గరిష్ట ఉష్ణోగ్రత పరంగా ఫిబ్రవరి 2025 రెండో అత్యంత వెచ్చనిది. రానున్న నెలల్లో దేశవ్యాప్తంగా ఎండలు దంచికొట్టవచ్చని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com