అమెరికాను శక్తిమంతమైన టోర్నడోలు కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా టెక్సాస్, ఓక్లహోమా, ఆర్కాన్సాస్‌లలో పరిస్థితులు దారుణంగా మారాయి. టోర్నడోలు ధాటికి ఇప్పటివరకు 14 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. టెక్సాస్‌లో ఓక్లహామా సరిహద్దుకు సమీపంలోని గ్రామీణ ప్రాంతాల్లో టోర్నడో బీభత్సానికి.ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.భీకర గాలుల విధ్వంసానికి అనేక చోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి.పెద్దసంఖ్యలో చెట్లు నేలకూలాయి.వేలాది సముదాయాలకు విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు.చెట్లు, విద్యుత్తు లైన్లు కూలిపోవడంతో పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుందని. అధికారులు వెల్లడించారు. డల్లాస్, డెంటన్ తదితర చోట్ల ఏర్పడిన టోర్నడోల ధాటికి అనేక వాహనాలు తిరగబడ్డాయి. దీంతో రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పశ్చిమ టెక్సాస్, న్యూ మెక్సికో, అరిజోనా, కొలరాడో, ఓక్లహామాలోని కొన్ని ప్రాంతాల్లో కార్చిచ్చులు ఏర్పడే ప్రమాదం ఉందనే.. హెచ్చరికలు జారీ అయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com