నీట్ పై మా పోరాటం ఆగదు - సీఎం స్టాలిన్

నీట్ పై మా పోరాటం ఆగదు - సీఎం స్టాలిన్

నీట్‌ పరీక్షలో మినహాయింపు ఇచ్చేంత వరకు తమ పోరాటం ఆగదన్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌. నీట్‌ వ్యతిరేక బిల్లుకు సంతకం చేసేదిలేదన్న గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తీరుపైనా స్టాలిన్ మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేశారు డీఎంకే నేతలు, కార్యకర్తలు. నీట్‌ రద్దు చేయాలంటూ మంత్రి ఉదయనిధి నేతృత్వంలో నిరాహార దీక్ష జరిగింది. నీట్ పరీక్షలో తమ రాష్ట్రానికి మినహాయింపు ఇచ్చేవరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. నీట్‌ వల్ల పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్న ఆయన... దీనిపై ఢిల్లీలోనూ పోరాటం చేస్తామన్నారు.

Next Story