మియాజాకీనా మాజాకా..! తినాలంటే ఆస్తులు అమ్మాల్సిందే

మియాజాకీనా మాజాకా..! తినాలంటే ఆస్తులు అమ్మాల్సిందే
సాధారణంగా మామిడి పళ్లు రుచిని...... వాటి రకాన్ని బట్టి కిలో 50 రూపాయల నుంచి 5 వందల రూపాయల వరకు ఉంటాయి. ఇక వెయ్యి నుంచి వేల రూపాయలు పలికే కొన్ని అరుదైన రకాలూ ఉన్నాయి. కానీ జపాన్‌కు చెందిన మియజాకీ అనే మామిడి రకం అరుదైన వాటిల్లోనే మరింత ప్రత్యేకమైన రకం. ఈ మియజాకీ మామిడిని తినాలంటే మనం ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఎందుకుంటే వీటి ధర కిలో అక్షరాల 2 లక్షలా 70 వేల రూపాయలు.

సాధారణంగా మామిడి పళ్లు రుచిని...... వాటి రకాన్ని బట్టి కిలో రూ. 50 నుంచి రూ. 500 వరకు ఉంటాయి. ఇక వెయ్యి నుంచి వేల రూపాయలు పలికే కొన్ని అరుదైన రకాలూ ఉన్నాయి. కానీ జపాన్‌కు చెందిన మియాజాకీ అనే మామిడి రకం అరుదైన వాటిల్లోనే మరింత ప్రత్యేకమైన రకం. ఈ మియాజాకీ మామిడిని తినాలంటే మనం ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఎందుకుంటే వీటి ధర కిలో అక్షరాల రూ. 2 లక్షలా 70 వేలు. అవును మీరు విన్నది నిజమే. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో నిర్వహించిన మామిడిపండ్ల ప్రదర్శనలో ఈ మియాజాకీ మామిడి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. జూన్ 17 నుంచి 19 వరకు రాయ్‌పూర్‌లో ఈ మామిడిపండ్ల ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో మియాజాకి మామిడి పండ్ల ధర కిలో 2 లక్షల 70 వేలు పలుకుతోందని నిర్వాహకులు తెలిపారు.

ఈ మామిడిని పండించడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారని... దీని రుచి అద్భుతంగా ఉంటుందని అందుకే ఈ మామిడిపండ్లకు ఇంత ధరని తెలిపారు. తియ్యగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత మృదువుగా ఉంటుంది మియజాకీ. దీన్ని తొక్కతో సహా తినొచ్చట. అందుకే వాటిని ఒక్కసారైనా రుచి చూడాలనే అనుకుంటారంతా. ఒకప్పుడు మియజాకీలో మాత్రమే వీటిని పండించేవారు. ఇప్పుడు ఇండొనేషియా, ఫిలిప్పీన్స్‌, థాయ్‌ల్యాండ్‌, బంగ్లాదేశ్‌ల్లోనూ పండిస్తున్నారు. ఎలాగో మనదేశానికీ కొన్ని మొక్కలు చేరాయి.


Tags

Read MoreRead Less
Next Story