టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావు

టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావు

వైసీపీకి రాజీనామా చేసిన యార్లగడ్డ వెంకట్రావు.. టీడీపీలో చేరారు. విజయవాడలోని నిడమానూరు శివారులో క్యాంప్‌ దగ్గర యార్లగడ్డకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు లోకేష్‌.. ఈ సందర్భంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. వంశీ పోవాలి.. యార్లగడ్డ గెలవాలంటూ నినదించారు. ఆ తర్వాత లోకేష్‌తో యార్లగడ్డ వెంకట్రావు సమావేశమయ్యారు. రేపు గన్నవరంలో యువగళం భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చించారు. 2లక్షల మందితో టీడీపీ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Next Story