సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను కుప్పం పోలీసులు అర్ధరాత్రి అదుపులోకి తీసుకొని 41ఏ నోటీసు జారీ చేశారు. నాగార్జున యాదవ్ ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబును అలిపిరి ఘాట్ వద్ద వెంకన్న కాపాడారని.. ఈసారి ఎవరూ రక్షించలేరని బెదిరించడంతో పాటు అవమానకరంగా మాట్లాడారు. దీనిపై తెలుగు యువత రాష్ట్ర ప్రతినిధి వరుణ్ ఫిర్యాదు చేశారు. బెంగళూరు నుంచి వస్తుండగా కుప్పం వద్ద నాగార్జునను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మరోవైపు నాగార్జున యాదవ్‌పై కేసుకు సంబంధించి గతవారం హైకోర్టులో కూడా విచారణ జరిగింది. నాగార్జునపై నమోదు చేసిన కేసులో పూర్తి వివరాలు సమర్పించాలని కుప్పం పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఓ టీవీ డిబేట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని.. చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కె వరుణ్‌కుమార్ నాగార్జున యాదవ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా నాగార్జునయాదవ్‌పై కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు.. వెంటనే నాగార్జున యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com