
తెలంగాణలో ఆదివారం ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. గెలుపు తమదే అంటే తమదే అంటూ అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలారెడ్డి వెరైటీ గిఫ్ట్ పంపించారు. బైబై కేసీఆర్ అంటూ కేసీఆర్‌కు సూట్ కేసును గిఫ్ట్‌గా పంపించారు. కేసీఆర్ పాలనకు ఎండ్ కాడ్ పడబోతుందన్నారు. కేసీఆర్ ప్యాక్ అప్ చేసుకునే టైం వచ్చిందని... ఆయనకు ఒక గిఫ్ట్ ఇస్తున్నామని అన్నారు. కర్నాటక ఎన్నికల్లో 71 మంది పదివేల మెజార్టీతో గెలిచారు. పదివేల మెజార్టీ అయినా కూడా ముఖ్యం కాబట్టి.. తాము పోటీ చేసి ఒకవేల 5,000 ఓట్లు చీల్చినా తేడా వస్తుందని.. కేసీఆర్‌ను ఓడించాలని కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చామని అన్నారు. ఇన్నాళ్లు బీజేపీ , బీఆర్ఎస్ కలిసే ఉన్నారని తెలంగాణ ప్రజలకు అర్థం అయ్యిందన్నారు. కేసీఆర్ అవినీతి మీద బీజేపీ ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదని విమర్శించారు. వీళ్లిద్దరు తోడుదొంగలు అయి కలిసే ఉన్నారని ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com