టీడీపీ శ్రేణులపై వైసీపీ నాయకుల దాడి

టీడీపీ శ్రేణులపై వైసీపీ నాయకుల దాడి

అనకాపల్లి జిల్లా చోడవరం మండలం మైచర్లపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ శ్రేణులపై వైసీపీ నాయకులు దాడి చేశారు. చేపలచెరువు వేలంపాట విషయంలో నెలకొన్న వివాదం చినికి చినికి గాలివానగా మారింది. వేలంపాట ద్వారా వచ్చిన రెండు లక్షల రూపాయల్లో.. యాభై వేల రూపాలయలను పంచాయతికి తక్కువగా కట్టడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. లెక్కలు చూపాలన్న టీడీపీ వర్గీయులపై వైసీపీ సర్పంచ్‌ మాణిక్యం దాడి చేశాడు. దీంతో ఆరుగురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story