రవీంద్ర జడేజాకు జరిమానా విధించిన ఐసీసీ

రవీంద్ర జడేజాకు జరిమానా విధించిన ఐసీసీ
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఫీల్డ్ అంపైర్ అనుమతి లేకుండా జడేజా తన వేలికి క్రీమ్ రాసుకున్నాడు

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు జరిమానా విధించింది ఐసీసీ. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఫీల్డ్ అంపైర్ అనుమతి లేకుండా జడేజా తన వేలికి క్రీమ్ రాసుకున్నాడు. నిబంధనలు అతిక్రమించాడని ఫైన్ వేసింది. మ్యాచ్ ముగిసిన నిమిషాల వ్యవధిలోనే మ్యాచ్ ఫీజులోని 25శాతం కోత విధించింది. డీ మెరిట్ పాయింట్ను కూడా ఐసీసీ చేర్చింది. క్రీమ్ రాసుకునే ముందు తప్పనిసరి ఫీల్డ్ ఎంపైర్ నుంచి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.

తొలి ఇన్నింగ్స్ లో అప్పటికే మూడు వికెట్లు పడగొట్టిన జడేజా, మరోసారి బౌలింగ్ వేసేందుకు వచ్చాడు. 46వ ఓవర్ వేసే ముందు సిరాజ్ దగ్గరికి వెళ్లాడు. సిరాజ్ దగ్గర జెల్ లాంటి పదార్థాన్ని తీసుకుని స్పిన్ చేసే వేలికి రాసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఐసీసీ జడేజాకు ఫైన్ విధించింది. ఈ విషయంపై టీమిండియా మేనేజ్మెంట్ స్పంధించింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ దగ్గరికి వెళ్లి జడేజా తన వేలికి ఆయింట్‌మెంట్ రాసుకున్నాడని తెలిపింది. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా టీం ఈ విషయంపై ఫిర్యాదు చేయలేదు.

Tags

Read MoreRead Less
Next Story