క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు నటి సయామీ ఖేర్‌ కసరత్తు

క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు నటి సయామీ ఖేర్‌  కసరత్తు

నటి సయామీ ఖేర్‌ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. సాయిధరమ్ తేజ్ మొదటి చిత్రం రేయ్‌లో హీరోయిన్ గా నటించిన సయామీ ఖేర్ ఆ తర్వాత చాన్నాళ్లకు నాగార్జునతో వైల్డ్ డాగ్‌లో నటించింది. పలు బాలీవుడ్, మరాఠీ చిత్రాల్లో తళుక్కుమంది. అయితే సయామీ ఖేర్ కు నటన మాత్రమే కాదు క్రికెట్ కూడా వచ్చు. ఆమె బ్యాటింగ్ స్టయిల్ చూస్తే ఏ ప్రొఫెషనల్ క్రికెటర్ కూ తీసిపోదు. ప్రస్తుతం భారత్ లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జరుగుతున్న నేపథ్యంలో, సయామీ ఖేర్ క్రికెట్ పై తనకున్న ఆసక్తిని బయటపెట్టింది. ఇప్పుడామె నెట్స్ లో ముమ్మరంగా ప్రాక్టీసు చేస్తోంది.

వచ్చే ఏడాది తప్పకుండా డబ్ల్యూపీఎల్ సెలెక్షన్ కు వెళతానని చెబుతోంది. అయితే, సినిమా షూటింగులేవీ లేకపోతేనే సెలెక్షన్ కు వెళతానని అంటోంది. స్కూల్లో చదివేటప్పుడు క్రికెట్ ఆడేదాన్ని కాదని, ఇతర క్రీడలు ఆడేదాన్నని సయామీ వెల్లడించింది. ఇప్పుడు ఓ క్రికెట్ జట్టును తయారుచేసుకుని ఆడుతున్నానని, భారత్ లో డబ్ల్యూపీఎల్ మ్యాచ్ లు జరుగుతుండడం ఆనందం కలిగిస్తోందని తెలిపారు. ఇక క్రికెట్ ఆడడం అనేది తన చిన్ననాటి కల అని సయామీ ఖేర్ చెప్పింది.

Read MoreRead Less
Next Story