MS Dhoni : సముద్రపు దొంగగా కెప్టెన్ ధోనీ

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ హాలీవుడ్ ఫేమస్ క్యారెక్టర్ స్పారో గా అవతారం ఎత్తారు. ఈ లుక్ లో ధోనీ స్టన్నింగ్ గా కనిపిస్తున్నారని అంటున్నారు ఆయన అభిమానులు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచాన్ని ఎలా మైమరపించే గిమ్మిక్కులు చేస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు. వివిధ ప్రయోజనాల కోసం AI- ఆధారిత సాధనాలను ప్రజలు ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రూపొందించబడిన అనేక చిత్రాలు కళాకారులచే రూపొందించ బడుతున్నాయి.
జ్యో జాన్ ముల్లూర్ అనే కళాకారుడు క్రికెటర్ల చిత్రాలను మిడ్‌జర్నీని ఉపయోగించి ప్రముఖ హాలీవుడ్ చలనచిత్ర పాత్రలుగా రూపొందించాడు. ఈ చిత్రాలలో MS ధోనీ, విరాట్ కోహ్లీ ఉన్నారు. జ్యో జాన్ ముల్లూర్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో తనను తాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఔత్సాహికుడిగా అభివర్ణించుకున్నాడు. కెప్టెన్ ధోనీ స్పారోగా, విరాట్ రాగ్నర్ లోత్‌బ్రోక్‌గా చిత్రాలను తయారుచేశారు. వీటిని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో రిలీజ్ చేశాడు. IPL జట్లలో అతని ఫెవరేట్ గా చెన్నై, ఆర్సీబీ అని ప్రకటించుకున్నాడు. కెప్టెన్ జాక్ స్పారో, రాగ్నర్ లోత్‌బ్రోక్ యొక్క అవతార్‌లలో ధోనీ, కోహ్లి ఇద్దరూ అచ్చుగుద్దినట్లు సరిపోయారు. ఈ చిత్రాలు ఆన్‌లైన్‌లో నెటిజన్లను ఆకర్షించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com