క్రీడలు

2011 Worldcup: యూవీ క్రెడిట్ ధోనీ కొట్టేశాడా..ఆ మాజీ క్రికెటర్ ఏం చెప్పాడంటే..

2011 World Cup Final match: 2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ స్థానంలో మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్‌కి రావడం

2011 Worldcup: యూవీ క్రెడిట్ ధోనీ కొట్టేశాడా..ఆ మాజీ క్రికెటర్ ఏం చెప్పాడంటే..
X

2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ స్థానంలో మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్‌కి రావడం క్రికెట్ ప్రపంచంలో ఓ వివాదంగా మారింది. అప్పటికే పటిష్టమైన స్థితికి చేరుకున్న టీమిండియా విజయంలో క్రెడిట్ కొట్టేయడానికే మాహీ అలా చేశాడని వాదిస్తారు యువీ అభిమానులు...2011 వన్డే వరల్డ్‌కప్ విజయానికి 10 ఏళ్లు దాటినా, ఇప్పటికే యువరాజ్ సింగ్‌కి ఆ విజయంలో దక్కాల్సినంత గుర్తింపు, రావాల్సినంత క్రెడిట్ రాలేదనేది చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ ఆవేదన.

అయితే ఈ విషయంపై తాజాగా స్పందించాడు శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్...'ధోనీకి నా బౌలింగ్ ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. చెన్నై సూపర్ కింగ్స్‌లో ఉన్నప్పుడు అతనికి చాలాసార్లు నెట్స్‌లో బౌలింగ్ చేశాను. అతను నా బౌలింగ్‌ని చక్కగా అర్థం చేసుకున్నాడు. అందుకే 2011 వరల్డ్‌కప్‌లో ఆ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు.

ఎందుకంటే యువరాజ్ సింగ్‌కి నా బౌలింగ్ ఎదుర్కోవడం చాలా కష్టం. అందుకే మరో వికెట్ పడితే, మాకు (శ్రీలంక) మళ్లీ పట్టు సాధించే అవకాశం ఉంటుందని ధోనీ భావించి... యువీ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు...' అంటూ కామెంట్ చేశాడు ముత్తయ్య మురళీధరన్...2011 వన్డే వరల్డ్‌కప్ తర్వాత అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ముత్తయ్య మురళీధరన్... వన్డేల్లో 534, టెస్టుల్లో 800 వికెట్లు తీసి ఆల్‌టైం హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు..

వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు... నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. మహేళ జయవర్థనే 103 పరుగులతో అజేయంగా నిలిచాడు..275 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన భారత జట్టు, సున్నా పరుగుల వద్దే వీరేంద్ర సెహ్వాగ్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 18 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ కూడా అవుట్ కావడంతో 31 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది...విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ కలిసి మూడో వికెట్‌కి 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, భారత్‌ను ఆదుకున్నారు.

35 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ అవుటైన తర్వాత యువరాజ్ సింగ్ బ్యాటింగ్‌కి రావాల్సింది. అయితే బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ తీసుకున్న ధోనీ, యువీ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు...విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ కలిసి మూడో వికెట్‌కి 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, భారత్‌ను ఆదుకున్నారు. 35 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ అవుటైన తర్వాత యువరాజ్ సింగ్ బ్యాటింగ్‌కి రావాల్సింది. అయితే బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ తీసుకున్న ధోనీ, యువీ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు.

Next Story

RELATED STORIES