England vs Australia: మొదటి రోజు తడబడిన ఆస్ట్రేలియా

England vs Australia: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య 4వ యాషెస్ టెస్ట్(Ashes Test) మాంచెస్టర్‌లో ఓల్డ్ ట్రాఫోర్డ్ (Old Trafford) గ్రౌండ్‌లో మొదలైంది. మొదటి రోజు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. మాంచెస్టర్ గ్రౌండ్‌లో టాస్ గెలిచి, మొదట బౌలింగ్ చేసిన జట్టు ఇప్పటి వరకు గెలవకపోవడం గమనార్హం. ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 299 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ పాట్ కమిన్స్(1), మిషెల్ స్టార్క్(23)లు ఉన్నారు.
ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్(David Warner), ఉస్మాన్ ఖవాజాలు ఇన్నింగ్స్ ఆరంభించారు. బ్రాడ్ బౌలింగ్‌లో ఇన్నింగ్స్‌లో తొలి బంతినే బౌండరీకి తరలించిన డేవిడ్ వార్నర్ తన ఉద్ధేశ్యాల్ని స్పష్టం చేశాడు. ఫాంలో ఉన్న ఉస్మాన్ ఖవాజా 19 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేసి బ్రాడ్ బౌలింగ్లో ఎల్బీగా ఔటయ్యాడు. మరో వైపు పేలవ ఫాంలో ఉన్న వార్నర్ జాగ్రత్తగా ఆడుతూ వచ్చినా, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ ఇచ్చి నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్‌లు సింగిల్స్, బౌండరీలతో ఆడుతూ మరో వికెట్ పడకుండా ఆడారు. లంచ్ సమయానికి 107/2 పరుగులు చేసి లంచ్ విరామానికి వెళ్లారు.
లంచ్ తర్వాత మార్క్ వుడ్ బౌలింగ్‌లో 120 పరుగుల వద్ద స్మిత్(41) ఎల్బీగా ఔటయ్యాడు. తర్వాత వచ్చిన ట్రావిస్ హెడ్(48) వన్డే తరహాలో ఆడాడు. ఈ క్రమంలో లబుషేన్ 114 బంతుల్లో అర్ధసెంచరీ చేసి, టెస్టుల్లో 16వ హాఫ్ సెంచరీ చేశాడు. తాను ఎదుర్కొన్న తర్వాత బంతికే మొయిన్ అలీలో బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు.
టీ విరామం తర్వాత 5వ బంతికే బ్రాడ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. ఈ వికెట్‌తో టెస్టు క్రికెట్‌లో 600 వికెట్లు తీసిన బౌలర్‌గా ఘనత సాధించాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన మిషెల్ మార్ష్(51) గేర్లు మార్చి బౌండరీలతో వేగం పెంచాడు. 56 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. వోక్స్ బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్ ఎల్బీగా ఓటయ్యాడు. కొద్దిసేపటికే కీపర్ బెయిర్‌స్టో అద్భుతంగా పట్టిన లో లెవెల్ క్యాచ్‌కి మిషెల్ మార్ష్ పెవిలియన్ బాట పట్టాడు. అలెక్స్ కారే(20) పరుగులు రేసి 8వ వికెట్‌గా వెనుదిరిగాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 4 వికెట్లతో రాణించగా, స్టువర్ట్ బ్రాడ్ 2 వికెట్లు, మార్క్‌వుడ్, మొయిన్ అలీలు చెరో వికెట్ పడగొట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com