Lora Webster: 5 నెలల గర్భం అయినా పారాలింపిక్స్‌లో పతకమే ఆమె లక్ష్యం..

Lora Webster: 5 నెలల గర్భం అయినా పారాలింపిక్స్‌లో పతకమే ఆమె లక్ష్యం..
11 ఏళ్ల వయసులో ఎముక క్యాన్సర్‌ బారిన పడి ఎడమ కాలును కోల్పోయింది.

Lora Webster: ఆశావాహ ధృక్పదం ఆమెని అంతర్జాతీయ క్రీడాకారిణి చేసింది. పారాలింపిక్స్‌లో సిట్టింగ్ వాలీబాల్ క్రీడాకారిణిగా పతకం కోసం పోటీపడుతోంది అమెరికాకు చెందిన లోరా వెబ్‌స్టర్.

ఆమె ఐదు నెలల గర్భవతి. అప్పటికే ముగ్గురు పిల్లలు. అయినా నాలుగో బిడ్డ కావాలనుకుంది. " కోర్టులో ఉన్నప్పుడు అప్పుడప్పుడు వచ్చే కిక్ తప్ప, ఆడుతున్నప్పుడు నేను గర్భవతిని అన్న విషయం నిజంగా నాకు గుర్తు ఉండదు'' అని 35 ఏళ్ల వెబ్‌స్టర్ చెబుతోంది. 11 ఏళ్ల వయసులో ఎముక క్యాన్సర్‌ బారిన పడి ఎడమ కాలును కోల్పోయింది.

"రొటేషన్‌ప్లాస్టీ" అనే శస్త్రచికిత్స చేయించుకుంది. ఇందులో కాలు మధ్య భాగాన్ని తీసివేసి, చీలమండ కీలును పైకి జరిపి దానిని 180 డిగ్రీల కోణంలో తిప్పుతారు. అది మోకాలి స్థానంలో ఉంటుంది. దీంతో పాదం వెనక్కి తిరిగి ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి వాలీబాల్ ఆడుతున్నాను. అందుకు అనుగుణంగా నా శరీరాన్ని, నా మైండ్‌ని మలుచుకున్నాను. గర్భంతో ఉన్నా నాకేమీ ఇబ్బంది అనిపించదు. అయినా ఇష్టంగా చేస్తే ఏ పనైనా కష్టం అనిపించదు అని ఎంతో ఉత్సాహంగా చెబుతోంది.

పారాలింపిక్స్‌లో పాల్గొనడం ఇది ఐదోసారి. రెండవ పారాలింపిక్స్‌కి పోటీ పడినప్పుడు కూడా నేను గర్భంతో ఉన్నాను. పండంటి పాపాయి పుట్టింది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ప్రమాదం కాదు అని చెప్పింది. డాక్టర్ల సూచనలు సలహాలతోనే తాను ఆటకు సిద్ధమయ్యానని చెప్పుకొచ్చింది. లోరా శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో బ్రెజిల్‌తో తలపడనుంది.

సిట్టింగ్ వాలీబాల్ కూడా స్టాండింగ్ వాలీబాల్ వలె చాలా నియమాలను అనుసరిస్తుంది. ఒక వైపు ఆరుగురు ఆటగాళ్లు ఉంటారు. కానీ కోర్టు చిన్నది - 10 మీటర్లు x 6 మీటర్లు (సుమారు 32 x 20 అడుగులు) - మరియు మహిళల నెట్ 1.05 మీటర్లు (కేవలం 3 అడుగుల కంటే ఎక్కువ) వద్ద సెట్ చేయబడింది. శరీరానికి సంబంధించిన అవయవ బలహీనతలు దిగువ లేదా ఎగువన కావచ్చు. అయినా ఆట రూల్స్‌ కఠినంగానే ఉంటాయి.

వెబ్‌స్టర్ హైస్కూల్‌లో చదువుకునే రోజుల్లో నిలబడి వాలీబాల్ ఆడింది. ఆమె ప్రొస్థెటిక్ కాలు ధరించి ఆడేది. 2003 లో సిట్టింగ్ వాలీబాల్ గేమ్‌పై దృష్టి పెట్టడం ప్రారంభించింది. ఆమె తన ముగ్గురు పిల్లలు.. మడి (10), కోల్ (8), కైల్ (6) ఆమె భర్త పాల్‌తో కలిసి ఎక్కువగా ఇంట్లో శిక్షణ పొందుతానని చెప్పింది.

"ఒక వికలాంగుడి లక్ష్యాలు ఇప్పటికీ ఒక సమర్థుడి లక్ష్యాల వలె ఉంటాయి. మనం ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకుంటాము అన్నది మనమే నిర్ణయించుకోవాలి. అందుకోసం నువ్వు చేసే ప్రయత్నాలు బలంగా ఉండాలి '' అని చెప్పే వెబ్‌స్టర్ మాటలు అందరికీ వర్తిస్తాయి.

Tags

Read MoreRead Less
Next Story