CWC2023: అఫ్గాన్‌తో పాక్ అమీతుమీ

సెమీస్ రేసులో ఇంకా వెనకబడకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అప్ఘానిస్థాన్‌తో పాకిస్థాన్‌తో తలపడనుంది. చెన్నైలోని చెపాక్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. అసలే స్పిన్‌కు స్వర్గధామంగా ఉండే చెపాక్ పిచ్‌పై పటిష్టంగా ఉన్న అఫ్ఘాన్ బౌలర్లను పాక్ బ్యాట్స్‌మెన్లు ఎలా ఎదుర్కొంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు షాక్ ఇచ్చిన అఫ్గాన్ జట్టు.. ఇప్పుడు పాక్‌కు కూడా షాక్ ఇవ్వాలని పట్టుదలతో ఉంది. స్పిన్ పిచ్‌పై అఫ్గాన్ బౌలర్లకు..పాక్ బ్యాటర్లకు మధ్య అసలు సిసలైన సమరం జరగనుంది. టీమిండియా, ఆస్ట్రేలియాపై వరుసగా రెండు పరాజయాల తర్వాత బాబర్ అజామ్ సేనకు ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి. ఈ మ్యాచ్ ఓడిపోతే ఈ మెగా టోర్నమెంట్‌లో సెమీస్ చేరాలన్న పాకిస్థాన్ ఆశలు సంక్లిష్టంగా మారుతాయి. ప్రస్తుతం పాక్ నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిచి రన్‌రేట్ మెరుగుపర్చుకోవాలని బాబర్ సేన కోరుకుంటోంది. కానీ స్పిన్నర్లను ఎదుర్కోవడంతో పాక్ తిప్పలు పడుతోంది.
పాకిస్థాన్ సారధి బాబర్ ఆజమ్ నుంచి ఒక భారీ ఇన్నింగ్స్ రాలేదు. అఫ్గాన్‌పై మ్యాచ్‌లోనైనా బాబర్ రాణించాలని పాక్ కోరుకుంటోంది. 294 పరుగులతో ప్రస్తుత ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్న మహ్మద్ రిజ్వాన్‌పై పాక్ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ మెగా టోర్నమెంట్‌లో పాక్ బౌలింగ్ స్థాయికి తగ్గట్లు లేదు. షాహీన్ షా అఫ్రిది ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటాడు. అతనొక్కడే మెరుగ్గా రాణిస్తున్నాడు. హరీస్ రవూఫ్, హసన్ అలీల ఫామ్ పాక్‌ను ఆందోళనపరుస్తోంది.పాక్‌పై మ్యాచ్‌లో గెలిచి ప్రపంచకప్‌లో మరో సంచలనం సృష్టించాలని అఫ్ఘానిస్తాన్ పట్టుదలతో ఉంది. అఫ్గాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ మినహా మరే బ్యాటర్ కూడా ఈ టోర్నమెంట్‌లో పెద్దగా రాణించలేదు. ఇక్రమ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హష్మతుల్లా షాహిదీలపై భారీ ఇన్నింగ్స్‌లు ఆడాలని అఫ్గాన్ కోరుకుంటోంది. వన్డేల్లో ఇప్పటివరకు పాక్-అఫ్గాన్ ఏడు వన్డేల్లో తలపడగా ఏడింట్లోనూ పాకిస్థానే గెలిచింది.
పాకిస్థాన్ జట్టు:
బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, సల్మాన్ అలీ అఘా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీస్ రవూఫ్, హసన్ అలీ , షాహీన్ షా అఫ్రిది, మహ్మద్ వాసిమ్.
అఫ్ఘానిస్థాన్ జట్టు:
హష్మతుల్లా షాహిదీ ( కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ , ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్, ముజీబ్, ఫజల్హక్ ఫరూకీ, అబ్దుల్ రెహమాన్, నవీన్ ఉల్ హక్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com