APP MP-Crow Attack: ఆప్ ఎంపీపై కాకి దాడి..!

వాడీవేడీగా సాగుతున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాల వేళ ఒక హాస్య సన్నివేశం చోటు చేసుకుంది. ఆప్ ఎంపీ రాఘవ్ చద్ద పార్లమెంట్ బయట ఫోన్‌లో మాట్లాడుతూ నడుస్తూ వెళ్తుండగా ఒక కాకి ఎంపీన తలపై తన్నడంతో ఎంపీ వెంటనే తలని కిందకి దింపుకుంటూ వెళ్లాడు. ఈ ఫోటోని ఢిల్లీ భాజపా విభాగం ట్విట్టర్‌లో పెట్టింది. అంతటితో ఆగకుండా హిందీలో ఉన్న పాత సామెతని వ్యంగ్యంగా జోడించింది.
"ఝూట్ బోలే, కౌవ్వా కాటే(అబద్ధాలు మాట్లాడితే కాకి పొడుస్తుంది)" అని క్యాప్షన్ పెట్టింది. ఇప్పటి దాకా కేవలం ఈ సామెతని విన్నాం గానీ ఈ రోజు ప్రత్యక్షంగా చూశాం అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.
ఈ ఫోటోపై భాజపా నేతలు వ్యంగ్యంగా స్పందించారు. ఆ పార్టీ నేత తేజీందర్ పాల్ సింగ్ స్పందిస్తూ.. గౌరవ ఎంపీ రాఘవ్ చద్దాపై కాకి దాడి చేయడం బాధాకరం. మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com