ఈ టీమిండియా ఫాస్ట్ బౌలర్..ఇప్పుడు ఖగోళ శాస్త్రవేత్త

Astrophysicist: క్రికెట్‌పై ప్రేమతో దానినే కెరీర్ గా ఎంచుకుంటారు. దాంతో క్రికెటర్లు చదువుకు మధ్యలోనే ఫుల్ స్టాప్ పడుతున్నాయి. అయితే టీమిండియా క్రికెటర్లలో పోస్ట్ గ్రాడ్యూయేట్ పూర్తి చేసిన వారిలో ద్రావిడ్ ఒక్కడే ఉన్నాడు. కుంబ్లే, లక్ష్మణ్, అశ్విన్ కూడా అత్యున్నత చదువులు చదువుకున్నారు. అ మిగతా వారంతా ఇంటర్ లోపే అని చాలా మందికి తెలుసు. అయితే మనం చెప్పుకోబోయే ఈ టీమిండియా మాజీ క్రికెటర్ ఎవరూ ఊహించని స్థాయిలో ఆస్ట్రోఫిజిస్ట్ అయ్యాడు. ఆ క్రికెటర్ పేరు ఆవిష్కార్ సాల్వి.
అయితే టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇప్పుడు ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అని తెలుసుకుని క్రికెట్ అభిమానులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు నాసా లేదా ఇస్రో వంటి సంస్థల్లో పనిచేస్తారు. ఖగోళ భౌతిక శాస్త్రంలో పీహెచ్‌డీ మాటలు కాదు అసాధారణమైన తెలివితేటలతో పాటు ఓర్పు, సహనం ఉండాలి. తాజాగా ఆస్ట్రోఫిజిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసి భారత క్రికెట్ చరిత్రలో అత్యున్నత విద్యావంతుల జాబితాలో ముందువరుసలో నిలిచాడు.
అయితే అంతరిక్ష అధ్యయనాలపై మక్కువతో తాను ఆస్ట్రో ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశానని సాల్వి చెప్పుకొచ్చాడు. 2003లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. కేవలం 4 వన్డేలు మాత్రమే ఆడాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో 2 వికెట్లు పడగొట్టాడు. సాల్వి ఓ మ్యాచులో తీవ్రంగా గాయపడటంతో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. దేశవాలి టోర్నీలో ముంబైకి జట్టు తరుపున సాల్వి 50 ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో ఆడాడు. ఐపీఎల్‌లో కూడా ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున పాల్గొన్నారు. 39 ఏళ్ల సాల్వి పదవీ విరమణ పొందిన అనంతరం క్రికెట్ కోచ్‌గా కూడా మారాడు. 2018లో పుదుచ్చేరి జట్టు కోచింగ్ స్టాఫ్‌లో ఒకరిగా పని చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com