ABHISHEK: అభిషేక్ ఆట తీరు మారాల్సిందేనా..?

పాకిస్థాన్‌పై కొలంబో వేదికగా జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 మ్యాచ్‌లో ఒక వైపు ఇషాన్ కిషన్ విధ్వంసం కనిపిస్తే… మరో వైపు అభిషేక్ శర్మ వరుస వైఫల్యాలతో అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాడు. ఒత్తిడి, ఉత్కంఠ, అంచనాల నడుమ జరిగిన ఈ హైఓల్టేజ్ పోరులో ఇషాన్ తన దూకుడు బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పగా, అభిషేక్ మాత్రం మరోసారి డకౌట్‌గా వెనుదిరిగి విమర్శల పాలయ్యాడు. ఒకే మ్యాచ్‌లో ఇద్దరు ఓపెనర్ల కెరీర్ గ్రాఫ్‌లు విభిన్న దిశల్లో సాగినట్లుగా ఈ పోరు నిలిచిపోయింది. ప్రపంచ నెంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా పేరొందిన అభిషేక్ శర్మ నుంచి ఈ మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆశించారు అభిమానులు. స్పిన్‌కు సహకరించే కొలంబో పిచ్‌పై అతను తన సహజ దూకుడు ప్రదర్శించి పాకిస్థాన్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తాడని భావించారు. అయితే ఆ అంచనాలన్నీ కేవలం కొన్ని బంతుల వ్యవధిలోనే కూలిపోయాయి. పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే అభిషేక్ చెత్త షాట్ ఆడి వికెట్ కోల్పోయాడు.
పిచ్ స్వభావం బ్యాటింగ్‌కు అనుకూలంగా లేదని ముందే స్పష్టమైంది. బంతి ఆగుతూ వస్తుండగా, స్పిన్నర్లకు సహకారం ఎక్కువగా లభిస్తున్న పరిస్థితుల్లో ఓపికగా ఆడాల్సిన అవసరం ఉంది. కానీ మూడు డాట్ బాల్స్ తర్వాత అభిషేక్ ఆతృతకు లోనయ్యాడు. అతను షాట్ ఆడతాడని అంచనా వేసిన సల్మాన్ అలీ అఘా తెలివిగా ఫీల్డ్ సెట్ చేసి ఊరించే బంతి వేశాడు. ఆ ఉచ్చును గ్రహించకుండా గుడ్డిగా దాడి చేయడానికి ప్రయత్నించిన అభిషేక్, సులభంగా వికెట్ సమర్పించుకున్నాడు. కీలక మ్యాచ్‌లో ఇలాంటి నిర్లక్ష్యపు షాట్ జట్టుకు భారీ నష్టం కలిగించింది. ఇది వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అభిషేక్ డకౌట్ కావడం విశేషం.
టీమిండియాకు ఆందోళన
జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయిన అతను, నమీబియాతో మ్యాచ్‌ను అనారోగ్యంతో మిస్ అయ్యాడు. కీలకమైన పాకిస్థాన్ పోరులో తిరిగి జట్టులోకి వచ్చినా తన ఫామ్‌ను నిరూపించలేకపోయాడు. ప్రపంచకప్ టోర్నీలో ఇప్పటివరకు అతని ఖాతా తెరవకపోవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. సోషల్ మీడియాలో అభిమానుల అసహనం వ్యక్తమవుతోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్” అనే ట్యాగ్‌కు తగ్గ ప్రదర్శన కనిపించడం లేదని వ్యాఖ్యలు వస్తున్నాయి. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు సార్లు డకౌట్ అయిన గణాంకాలు కూడా చర్చకు వస్తున్నాయి. పరిస్థితులను గౌరవించకుండా అజాగ్రత్తగా దాడి చేస్తే ఇలాగే జరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే మరో వైపు ఇషాన్ కిషన్ మాత్రం అదే పిచ్‌పై అద్భుతంగా ఆడాడు. స్పిన్‌కు అనుకూలమైన వికెట్‌పై అతను ఓపికతో పాటు దూకుడు సమతుల్యం చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. క్రీజ్‌లో నిలబడటం ఎంత ముఖ్యమో, పరిస్థితులను అర్థం చేసుకుని ఆడటం ఎంత అవసరమో ఇషాన్ తన ఇన్నింగ్స్‌తో చాటి చెప్పాడు. ఒకే పిచ్‌పై ఇద్దరు బ్యాటర్లు ఎలా విభిన్న ఫలితాలు సాధించారో ఈ మ్యాచ్ స్పష్టంగా చూపించింది. జట్టు మేనేజ్మెంట్ దృష్టిలో అభిషేక్ ఫామ్ ఆందోళనకర అంశంగా మారింది. కీలక టోర్నీలో వరుస వైఫల్యాలు జట్టుకు ప్రమాదకరంగా మారవచ్చు. అతను తన దూకుడును నియంత్రించి పరిస్థితులకు అనుగుణంగా ఆడాల్సిన అవసరం ఉందని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
